నాలుగు పదుల వయస్సు మీద పడిన తరువాత తల్లి పాత్రలు, అక్క పాత్రలు వేసుకుంటూ అలనాటి హీరోయిన్స్ కాలం వెల్లదీస్తుంటారు. కానీ బాలీవుడ్ భామ బొద్దుగా చూడగానే ముద్దొచ్చేలా ఉండే విద్య బాలన్ మాత్రం ఇప్పటికి హీరోయిన్ గా తన హావ కొనసాగిస్తూనే ఉన్నారు. ఈమధ్య బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ కథనాయకుడు సినిమాలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో నటించి మెప్పించారు.

గతంలో విద్య బాలన్ హీరోయిన్ గా వచ్చిన “డర్టీ పిక్చర్”లో నటించి తన హాట్ లుక్స్ తో దేశవ్యాప్తంగా అన్ని బాషలలో తన అభిమానులను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో విద్య బాలన్ బోల్డ్ నెస్ చూసి చాల మంది కంగుతిన్నారు. ఎంతో బోల్డ్ గా ఏమాత్రం సిగ్గు పడకుండా తన పాత్రకు న్యాయం చేస్తూ అందరి నుంచి మంచి ప్రశంసలతో పాటు అదేవిధమైన విమర్శలను ఎదుర్కొంది. ఇంత వయస్సు వచ్చిన తరువాత ఇలాంటి పాత్రలు చేయడానికి సిగ్గు లేదా అన్న వారు ఉన్నారు. కానీ విద్య బాలన్ ఎప్పుడు తన మీద వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయింది.

ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో హ్యూమన్ కంప్యూటర్ గా పేరుగాంచిన గణిత శాస్త్రవేత్త శకుంతలా దేవి జీవితగాధ ఆధారంగా రూపొందుతున్న “శకుంతలా దేవి” సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో విద్య బాలన్ తనపైన వచ్చే కామెంట్స్ కు సమాధానంగా తాను నటించే డర్టీ పిక్చర్ లాంటి సినిమాలు ఇష్టపడని వారు నా సినిమాలు చూడనవసరం లేదని, “డర్టీ పిక్చర్, కహాని” సినిమాల తరువాత నేను సొంతగా సినిమాలు ఎంపిక చేసుకోవడం నేర్చుకున్నానని అన్నారు. 

నా బోల్డ్ నెస్ తో, నా హాట్ లుక్స్ వలన నాకు అన్ని బాషలలో మంచి ఆఫర్స్ వస్తున్నాయని, నా సినిమాలు కొందరికి నచ్చవచ్చు … కొందరికి నచ్చక పోవచ్చునని. కానీ నచ్చిన సినిమాలు చేసి సేచ్ఛగా జీవించడం నా హక్కని దానిని ఎవరు భంగం కలిగించలేరు. నేను ఇష్టం లేదు అనుకున్న వారు నా సినిమా చూసి విమర్శించడం దేనికో అంటూ ఘాటుగానే రిప్లై ఇచ్చింది. విద్య బాలన్ “గురు, డర్టీ పిక్చర్, కహాని, తూమాటి సులు” వంటి సినిమాలతో మంచి నటిగా పేరుతెచ్చుకుంది.