సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ‘సర్కార్ వారి పాట’. ‘గీత గోవిందం’ ఫేం పరుశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతుంది. ఇక ఈ సినిమా గురించి ఆసక్తికరమైన వార్త బయటకి వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. మహేష్ అక్క పాత్రలో ఆమె నటించబోతుందట. ఇక డైరెక్టర్ పరుశురాం విద్యాబాలన్ కి ఇప్పటికే కథ చెప్పాడని.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఫిలిం నగర్ సమాచారం. ఇక దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

ఇక ఈ సినిమా ఓ బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో ఉండబోతుంది. దేశంలో జరిగిన కొన్ని భారీ బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో సామాజిక అంశాలను స్పృశిస్తూ కథ నడుస్తుందట. ఈ సినిమాలో ఓ బ్యాంకుకు వందల కోట్లు ఎగ్గొట్టిన ఓ బడా పారిశ్రామికవేత్త నుండి డబ్బును ఎలా రికవరీ చేస్తారనే పాయింట్ చుట్టూ సినిమా తిరుగుతుందని సమాచారం. ఇక ఈ సినిమాను మైత్రి మూవీస్ తో పాటు జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మించనున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్ లో అమెరికాలో ప్రారంభం కానుంది.

మెగా ఫ్యామిలిలో కరోనా.. నాగబాబు అధికారిక ప్రకటన..!

స్విగ్గీ మోసంపై డెలివరీ బాయ్స్ తీవ్ర నిరసన.. ఎట్టికేలకు దిగివచ్చిన యాజమాన్యం..!

టిక్ టాక్ ప్రియులకు ఊరట.. యూట్యూబ్ షార్ట్స్ వచ్చేసింది..!