బైట్ డ్యాన్స్ సంస్థ టిక్ టాక్ కు అనే షార్ట్ వీడియో యాప్ ద్వారా వేల కోట్ల రూపాయలను ఆర్జిస్తోంది. ఒక్క టిక్ టాక్ అనే చిన్న వీడియో స్ట్రీమింగ్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంత మన్ననలు పొందిందటే ఊహించడం కష్టమే. అంతలా టిక్ టాక్ అనతికాలంలో ఎదగగా ఇప్పుడు టిక్ టాక్ ను భారత్ తో పాటు అమెరికాలో బ్యాన్ చేయడంతో ఇప్పుడు టిక్ టాక్ ను ఆయా దేశాలకు అమ్మేయాలని బైట్ డ్యాన్స్ సంస్థ ఆలోచిస్తుంది. ఇక టిక్ టాక్ కు ఇప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుంటే ఇప్పుడు వియాత్నం దేశానికి చెందిన టెక్నాలజీ సంస్థ విఎన్జీ తన వీడియోలను వాడుతున్న మ్యూజిక్ కు టిక్ టాక్ లైసెన్స్ లు లేకుండా ఉపయోగిస్తుందని తమకు 5.95 మిలియన్ డాలర్లు చెల్లించాలని కోర్టు ద్వారా నోటీసులు పంపించింది.

VNG కార్పొరేషన్ అనేది వియాత్నం ఆదరికత సాంకేతిక సంస్థ. ఇది 2004లో స్థాపించబడింది. ఇది ఆన్ లైన్ గేమింగ్, మ్యూజిక్ స్ట్రీమింగ్ మరియు మెసేజ్ అనువర్తనలతో ప్రసిద్ధి చెందింది. టిక్ టాక్ వియాత్నంలో ప్రసిద్ధి చెందటంతో పాటు దాదాపుగా పది మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకొని టిక్ టాక్ ను ఆస్వాదిస్తున్నారు. దీనితో ఇప్పుడు VNG రోజంత తన మ్యూజిక్ వాడటానికి టిక్ టాక్ సంస్థకు అనుమతి లేదని దావా వేయడంతో ఇప్పుడు బైట్ డ్యాన్స్ సంస్థ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. టిక్ టాక్ వియాత్నంలో కాపీ రైట్ ఉల్లంఘన నుంచి తప్పించుకోవడం కష్టతరమని, అక్కడ చట్టాలు వదిలిపెట్టే సమస్యే లేదని తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా టిక్ టాక్ ఎలాంటి లైసెన్స్ లు తీసుకోకుండా కోట్లలో మ్యూజిక్ ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని వాడుకోవడం జరుగుతుంది. టిక్ టాక్ సంస్థ ఎలాంటి హక్కులను లేకుండా ఉచితంగా వాడుకోవడంతో పాటు వేల కోట్ల రూపాయలను ఆర్జిస్తోంది.