తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా సినిమా ‘బిగిల్’. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ఫుట్ బాల్ ప్లేయర్ గా విజయ్ కనిపించబోతున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ శనివారం విడుదల చేశారు. ఇక దీపావళి కానుకగా ఈ నెల 27న సినిమా విడుదల కానుంది.