విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన “డియర్ కామ్రేడ్” సినిమా గత శుక్రవారం విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కొన్ని ఏరియాలలో సినిమాపై నెగటివ్ టాక్ వచ్చినా ప్రస్తుతానికైతే సినిమా కలెక్షన్స్ ఏమాత్రం తగ్గకుండా దూసుకెళ్తుంది. ఇక రేపటి నుంచి సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఇక విజయ్ దేవరకొండ “అర్జున్ రెడ్డి”, “గీత గోవిందం” సినిమాలతో తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరుచుకుని మెయిన్ స్ట్రీమ్ హీరోగా ఇండస్ట్రీలో ఎదిగిపోయాడు.

ఇక “డియర్ కామ్రేడ్” సినిమా సౌత్ ఇండియాలో నాలుగు బాషలలో విడుదల చేయాలని భావించి మ్యూజిక్ ఫెస్టివల్ పేరుతో హల్ చల్ చేసాడు. ఇక సినిమాకు సంబంధించి అన్ని ఏరియాల నుంచి మొదటి రోజు హౌస్ ఫుల్ బోర్డ్స్ కనపడటంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంత మంది ఉలిక్కిపడ్డారట. కానీ సినిమా ప్లాప్ అవ్వడంతో ఇప్పుడు వారంతా కొంత ఊపిరి పీల్చుకున్నారట. ఒకవేళ “డియర్ కామ్రేడ్” సినిమా హిట్ టాక్ వస్తే ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండను ఆపేవారు ఉండరని భావించారట. ఇప్పటికే ఒక తెలుగు హీరో గతంలో విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ సమయంలో కొంత లొల్లి సోషల్ మీడియా వేదికగా చేసాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఈ పండుగ చేసుకోవడం ఏమిటో అర్ధం కావడం లేదు.

 
  •  
  •  
  •  
  •  
  •  
  •