తమిళంలో మంచి పేరున్న నటులలో విజయ్ సేతుపతి కూడా ఒకడు. అతడు హీరోగా ఈమధ్య వచ్చిన “96” చిత్రం తమిళంలో సంచలన విజయం నమోదు చేసుకుంది. ఆ సినిమాను తెలుగులో దిల్ రాజు ప్రొడక్షన్ లో సమంత, శర్వానంద్ జంటగా రీమేక్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి “సైరా” చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

మరోసారి తెలుగు ఇండస్ట్రీలో మంచి పాత్రతో అభిమానులను ఆకట్టుకోవడానికి ముందుకు వస్తున్నాడు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో “ఉప్పేనా” అనే సినిమాకు క్లాప్ కొట్టారు. ఈ సినిమా వచ్చే జనవరిలో షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమా కోసం విజయ్ సేతుపతిని హీరోయిన్ తండ్రి పాత్రలోకి తీసుకున్నారు. ఇందులో విజయ్ సేతుపతి ప్రతినాయకుడు పాత్రలో నటిస్తున్నాడు. అంటే హీరోయిన్ తండ్రే విలన్ అన్న సంగతి తెలుస్తుంది.

ఈ సినిమా కోసం విజయ్ సేతుపతికి దాదాపుగా మూడు కోట్ల రూపాయలు ముట్టచెప్పారట. విజయ్ సేతుపతి మంచి నటుడు కావడంతో పాటు తమిళంలో కూడా సినిమా విడుదల చేసుకొని మంచి కలెక్షన్స్ రాబట్టుకునే అవకాశం ఉండటంతో చిత్ర యూనిట్ కూడా పెద్దగా వర్రీ కావడం లేదట. ప్రస్తుతానికి అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురంలో” సినిమా చేస్తుండటంతో ఆ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఆ సినిమా విడుదలైన వెంటనే సుకుమార్ సినిమాను లైన్ లో పెట్టి వచ్చే ఏడాది చివరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.