క్రేజి హీరో విజయ్ దేవరకొండ-సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాతో కేదార్ సెలగంశెట్టి అనే యువ నిర్మాత ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. కేదార్ సెలగంశెట్టి.. విజయ్ దేవరకొండకు అత్యంత సన్నిహితులు కావడంతో మొదటి చిత్రాన్ని ఆయనతో ప్లాన్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని ఫాల్కన్ క్రియేన్స్ బ్యానర్‌పై తెరకెక్కించబోతున్నారు.

ఇక ఈ సినిమా 2022 లో మొదలవుతుందని నిర్మాత తెలియచేసారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ఉండబోతుందని.. కొత్తదనాన్ని ఇష్టపడే విజయ్-సుకుమార్ ల కలయికలో అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని నిర్మాత సెలగంశెట్టి తెలియచేసారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ తో ‘పుష్ప’ సినిమా తీస్తున్న సుకుమార్.. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవగానే విజయ్ దేవరకొండ సినిమా పనులు ప్రారంభిస్తారు.

భారత్ లో భారీ ఊరట.. 11 రోజుల్లోనే 10 లక్షల మంది రికవరీ..!

లేటు వయసులో డిగ్రీ పరీక్ష రాసిన సినీనటి..!

అసాధ్యమనుకున్న టార్గెట్‌ను చేధించిన రాజస్థాన్ రాయల్స్..!

బిగ్ బాస్ లో ఊహించని షాక్..!