ఇటీవల తెలంగాణాలో అబ్దుల్లాపూర్ మెట్ లో తహశీల్ధార్ విజయారెడ్డిని సురేష్ అనే కౌలు రైతు హత్యచేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో సురేష్ కూడా 60 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరి గురువారం రాత్రి మృతి చెందాడు. ఈ సందర్భంగా సురేష్ భార్య లత మీడియాతో సంచలనమైన విషయాలు బయటపెట్టింది.

తన భర్తకి అసలు విజయారెడ్డిని చంపాలనే ఆలోచన లేదని.. కేవలం తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడి.. వియయారెడ్డిని భెదిరించాలనుకున్నాడని ఆమె తెలిపింది. అయితే తన భర్త చెప్పేది విజయారెడ్డి వినిపించుకోకపోవడంతోనే పెట్రోల్ పోసి తగల పెట్టాడని పేర్కొంది. కేవలం భెదిరిద్దామని వెళ్లి ఆవేశంలో ఈ పని చేశాడన్న ఆమె.. విజయారెడ్డి హత్య తనకు కూడా భాద కలిగించిందన్నారు. విజయరెడ్డికి లంచం ఇచ్చినట్లు తన భర్త తనకి చెప్పాడని.. తన భర్త సురేష్ కి వచ్చిన చావు మరే రైతుకు రాకూడదని ఆమె కోరుకుంది.