ఏపీ ప్రభుత్వం కొత్తగా వచ్చే ఏడాది నుంచి ఒకటవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ను ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకవైపున కార్పొరేట్ స్కూల్స్ లలో దొరికే ఇంగ్లీష్ మీడియంతో పాటు జగన్ సర్కార్ ప్రతి ఏడాది అమ్మవడి కింద ప్రతి తల్లికి 15 వేల రూపాయలు ఇవ్వాలని భావించడంతో ఏపీ ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి తెలుగు విద్యను తొక్కేస్తూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ను ప్రభుత్వం ప్రవేశ పెట్టడాన్ని చంద్రబాబుతో పాటు అతడి కొడుకు లోకేష్ ఖండించారు.

దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ “మీ పిల్లల్ని మాత్రం ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తారు. పేద పిల్లలు మాత్రం తెలుగులోనే చదవాలి. వాళ్లు ఉన్నత స్థాయికి ఎదగ కూడదు. విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్ల కూడదని కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు తండ్రీ కొడుకులు. దేవాన్ష్ ను తెలుగుమీడియంలో చదివిస్తామని చెప్పండి చూద్దాం?” అంటూ ట్వీట్ చేయడం జరిగింది.