వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి నిన్న, ఈరోజు పార్లమెంట్ ఆవరణంలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో న్యాయశాఖ ఎలా పనిచేస్తుంది, హై కోర్టులో వచ్చే తీర్పులు ఒకరికి అండగా నిలిచేలా ఉన్నాయని ఇలా రావడం దారుణమని, అసలు ఒక అవినీతి కేసులో విచారణ చేసే సమయంలో సెక్షన్ 19 ప్రకారం కేసు నమోదైనప్పుడు స్టే ఇచ్చే అధికారం న్యాయమూర్తులకు లేదని అవినీతి నిరోధక చట్టంలో దీనిపై స్పష్టంగా చెప్పారని అన్నారు.

అసలు మీడియాను అణచివేసేలా హైకోర్టులో ఇలా తీర్పు రావడంపై కూడా తప్పు పడుతూ ఇలాంటి తీర్పులు గతంలో మన దేశంలో ఎక్కడ చూడలేదని, ఒక్క ఏపీలో మాత్రమే చూస్తున్నామని అన్నారు. ఇక నేషనల్ మీడియాకు చెందిన పలువురు సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ అంశాన్ని తప్పుపడుతూ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇక పార్లమెంట్ సమావేశాలలో ఈ అంశాన్ని గట్టిగా వినిపించి వైసీపీ సర్కార్ పై న్యాయస్థానాలలో వెలువడుతునం తీర్పులపై గట్టిగానే గళం విప్పారు.

ఇలా జాతీయ మీడియాలో కూడా ఈ అంశం చర్చించుకునేలా ఒక పధకం ప్రకారం వైసీపీ సర్కార్ అవలంబించిన తీరుపై అనేకమంది ప్రశంసలు అందుకుంటున్నారు. ఇలా అన్యాయాలు జరిగినప్పుడు కూడా స్టేల పేరుతో వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా… కనీసం విచారణ కూడా నోచుకోని దుస్థితి నెలకొని ఉండటంతో రాబోయే రోజులలో ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళుతుందో చూడవలసిన అవసరం ఉంది.

జైలులో విపరీతంగా దోమలు కుడుతున్నాయట, తనకు ప్రత్యేక గది కావాలంటున్న డ్రగ్స్ భామ

రాజుగారి ఉత్సాహం చూస్తుంటే త్వరలో కొత్త పార్టీ పెట్టేలా ఉన్నారే

చైనాలో మరో ప్రమాదకర వ్యాధి, అది వస్తే నొప్పులు తట్టుకోలేరట