ఒకప్పుడు అన్నా చెల్లెలుగా దృఢమైన బంధంతో కలసి మెలసి ఉండే కేసీఆర్ – విజయశాంతిలు…ఇప్పుడు ఉప్పు, నిప్పులుగా మారిపోయారు. కేసీఆర్ పేరెత్తితేనే విజయశాంతి గరంగరం అయిపోతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కేంద్ర ప్రభుత్వం నిఘా పెటిందని బీజేపీ నేతల వ్యాఖ్యానాల పట్ల విజయశాంతి ఆనందం వ్యక్తం చేయడంతో పాటు ఇది శుభపరిణామమని అన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తుందని, రాష్ట్రంలో అసలు పాలన నడవడం లేదని, ఇష్టమొచ్చినట్లు ఎమ్మెల్యేలను కొనే పనిలోనే ఉన్నారని అన్నారు. గతంలో తాము టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే పరువు నష్టం కేసు వేస్తానని సీఎం కేసీఆర్ బెదిరించిన సందర్భాలు చూశామని అన్నారు. కేంద్ర ప్రబుత్వంపై బీజేపీ ప్రభుత్వం నిఘా పెట్టడంతో పాటు, అవకతవకలకు సంబంధించి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ, సమాచారం సేకరించడం శుభపరిణామమని విజయశాంతి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న విజయశాంతి కేసీఆర్ పై బీజేపీ పార్టీ నేతలు విమర్శలు చేస్తే, ఈమె స్వాగతం చెప్పడమేమిటో అర్ధం కావడం లేదు. దీనిని బట్టి కేసీఆర్ ను ఎవరు విమర్శించినా విజయశాంతికి ఆనందం కలిగించే అంశంగా తెలుస్తుంది.
  •  
  •  
  •  
  •  
  •  
  •