అన్నదమ్ములిద్ధ్రు ఆస్తులు చెరి సమానంగా పంచిపెడితే అన్నేమో తన తెలివితేటలతో పదింతలు పెంచి ప్రపంచంలోనే అత్యంత సప్పన్నుల జాబితో చోటు సంపాదించుకుంటే, తమ్ముడేమో చివరికి బికారిగా మిగిలిపోయి అత్యంత సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ఈ కథ అంతా ముఖేష్, అనిల్ అంబానీల కథ. ఈ కథలో ఇప్పుడు అనిల్ అంబానీ నికర ఆస్థి సున్నాగా గతంలో ప్రకటించి సంచలనం కలిగించాడు. వేల కోట్ల రూపాయల ఆస్తిని తన తండ్రి వారసత్వంగా తీసుకున్న అనిల్ అంబానీ ఇప్పుడు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతూ అంతర్జాతీయ కోర్టుల ముందు దోషిగా నిలబడుతున్నాడు.

చైనాకు చెందిన ప్రభుత్వ బ్యాంకుల నుంచి తన రిలయన్స్ కమ్యూనికేషన్ ను ఆర్ధికంగా గట్టెక్కించేందుకు 700 మిలియన్ డాలర్ల అప్పును గతంలో తీసుకున్నాడు. ఇప్పుడు ఆ అప్పును కట్టలేకపోవడంతో చైనా ప్రభుత్వం ఈ ఇష్యూ లండన్ కోర్టులో తేల్చుకునే పనిలో నిన్న లండన్ కోర్టు అనిల్ అంబానీని విచారించింది. ఇందులో భాగంగా చైనా బ్యాంకులకు డబ్బులు ఎగొట్టి మీరు అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లున్నారని కోర్టు ప్రశ్నించగా అనిల్ అంబానీ ఇచ్చిన సమాధానం షాకింగ్ అని చెప్పుకోవచ్చు.

తాను లాయర్లకు ఫీజ్ చెల్లించడానికి తన ఇంట్లో ఉన్న నగలు అమ్మి 9.9 కోట్ల రూపాయలను చెల్లించానని తాను ఎప్పుడు విలాసవంతమైన జీవితాన్ని గడపలేదని, తాను ఎంతో సంపన్న కుటుంబంలో పుట్టినా తాను ముందు నుంచి మద్యపానం, ధూమపానం, జూదం లాంటి వాటికి దూరంగా ఉంటానని, తాను ఇప్పుడు, ఎప్పుడు ఇంకా అలాంటి జీవితాన్ని చూసే అవకాశం లేదని చెప్పుకొచ్చారు. తనకు రోల్స్ రాయల్స్ కారు ఉందని చెప్పడంలో అర్ధం లేదని, తాను తన అవసరాల కోసం ఒక చిన్న కారుని మాత్రం వాడుతున్నానని అంతకు మించి ప్రస్తుతం తన దగ్గర ఏమి లేవని చెప్పుకొచ్చారు. గతంలో అనిల్ అంబానీ తన భార్య కోసం వేల కోట్ల రూపాయలతో భవంతి, వందల కోట్ల రూపాయలతో షిప్, స్పెషల్ ఫ్లైట్ ఇలా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలతో బాగానే ఎంజాయ్ చేసాడు. ఇప్పుడు పీకలలోతు అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో మొత్తం కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చినట్లు తెలుస్తుంది. రాబోయే రోజులలో అనిల్ అంబానీ మరిన్ని క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోక తప్పదని ఆర్ధిక విశ్లేషకులు చెబుతున్నారు.

డ్రగ్స్ కేసు వివాదంతో శివసేన సంచలన నిర్ణయం దిశగా అడుగులు

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో తెరపైకి బడా నిర్మాత పేరు..!