పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ UNGC లో ఇచ్చిన ప్రసంగం గురించి భారత్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాట్లాడుతూ అణు యుద్ధం గురించి ప్రసంగిస్తూ, అణు యుద్ధం జరగవచ్చ అనే రీతిలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడటం సరైనది కాదని, అతడు చేసిన ప్రసంగం రెండు దేశాల మధ్య మరింత వైరాన్ని పెంచుతుందని, చివరి వరకు పోరాడతామని చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని అతడు ఒక క్రికెటర్ గా రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

దీనికి పాకిస్థాన్ భామ వీణామాలిక్ ట్విట్టర్ లో హర్భజన్ కు కౌంటర్ ఇస్తూ ఇమ్రాన్ ఖాన్ తన ప్రసంగంలో శాంతి గురించి మాట్లాడారని, జమ్మూ, కాశ్మీర్ లో కర్ఫ్యూ ఎత్తి వేయడం వలన జరిగే సంఘటనలు, రక్తపాతం గురించి ఆందోళన వ్యక్తం చేశారు తప్ప అది బెదిరింపు కాదు, భయమని, అక్కడున్న వాస్తవిక పరిస్థితుల గురించి మాట్లాడారని, ఇమ్రాన్ ఖాన్ తన ప్రసంగంలో శాంతిని కోరుకున్నారని, నీకు ఇంగ్లీష్ అర్ధం కదా అని వీణ మాలిక్ కౌంటర్ ఇచ్చింది.

దీనికి హర్భజన్ మరోసారి రిప్లై ఇస్తూ ఓహో మీకు అలా అర్థమైందా, ఇదే నీకు వచ్చిన ఇంగ్లీష్ నెక్స్ట్ టైమ్ ఇంగ్లీష్ లో పెట్టడానికి ముందు సరిగ్గా చదివి పెట్టండి అని ఘాటు రిప్లై ఇచ్చాడు. ఇలా పాకిస్థాన్ క్రికెటర్లతోనే కాకుండా ఇప్పుడు పాకిస్థాన్ హీరోయిన్స్ కూడా భారత్ పై పడి ఏడుస్తూ ఇలా బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగాన్ని దాదాపుగా అందరూ తప్పు పడుతుంటే, పాకిస్థాన్ భామలతో పాటు క్రికెటర్లు మాత్రం వెనకేసుకొస్తున్నారు.