బంగ్లాదేశ్ సిరీస్ నుంచి విరామం తీసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలసి అందమైన ప్రాంతాలన్ని కలియతిరుగుతున్నాడు. అందులో భాగంగా తమ పర్యటనలో భాగంగా భూటాన్ పర్యటించి అక్కడ మంచు పర్వతాలలో పర్యటిస్తూ సేదతీరుతున్నాడు. అక్కడ ఉండే స్థానికులు ఈ జంటను గుర్తు పెట్టకపోవడంతో పాటు ఎవరో విహార యాత్రలకు వచ్చారని భావించి వారికి సకల మర్యాదలు చేస్తూ వారు టీ ఆఫర్ చేసారు.

ఈ విషయాన్ని అనుష్క శర్మ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకోవడం విశేషం. మనల్ని గుర్తు పట్టని ప్రాంతానికి వెళ్లి సెలబ్రెటీ స్టేటస్ వదిలేసి తిరగడం చాల సంతోషాన్ని ఇచ్చిందని అక్కడ ఒక అందమైన కుటుంబాన్ని చూశామని కాసేపు వారితో మాట్లాడి వారు ఇచ్చిన టీ తాగమని చెప్పుకొచ్చింది. అనుష్క పెట్టిన పోస్ట్ కు చాల మంది సెలెబ్రేటిస్ స్పందిస్తూ తాము ఇటువంటి అనుభూతిని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఇంత సాధారణ జీవితం మధురానుభూతులను మిగులుస్తాయని చెప్పుకొచ్చారు.