చంద్రబాబు నాయుడుకి తన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదురుకాని పరాభవం ఇప్పుడు ఎదురుకానుంది. గత సార్వత్రిక ఎన్నికలలో 23 స్థానాలను సరిపెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరడంతో ఆ సంఖ్య 19కు చేరింది. మరొక ఇద్దరు ఎమ్మెల్యేలు కనుక వైసీపీ పార్టీలో చేరితే చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష హోదా కోల్పోవడంతో సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోయే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. ప్రతిపక్ష హోదా ఉండాలంటే 18 మంది ఎమ్మెల్యేలు అవసరం ఇప్పుడు బాబుకి గండం పొంచి ఉంది.

ఇంకా ఆశ్చర్యకర విషయమేమిటంటే చంద్రబాబు ప్రతిపక్ష హోదా కోల్పోవడానికి విశాఖ ఎమ్మెల్యేలే కారణం కానున్నారట. విశాఖ రాజధాని వద్దని అమరావతీ రాజధాని కావాలని చంద్రబాబు కోరుకుంటుంటే ఇప్పుడు విశాఖ నుంచి వాసుపల్లి గణేష్ షాక్ ఇస్తే త్వరలో మరొక ఇద్దరు షాక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారట. నిన్న చంద్రబాబు నాయుడు విశాఖ నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తే అందులో ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారని తెలుస్తుంది. దీనితో విశాఖ ఎమ్మెల్యేల సాక్షిగా తాను ప్రతిపక్ష హోదా కోల్పోబోతున్నానా అని చంద్రబాబు తనలో తాను కుమిలిపోతూ ఇష్టానుసారంగా వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ, సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని మత రాజకీయాలను పెంచి పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రతిపక్ష హోదా కోల్పోవడంతో పాటు త్వరలో తన మీద ఉన్న 19 స్టేలు కూడా తీసివేసి కేసులను ఎదుర్కొనే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని, రాబోయే రోజులన్ని చంద్రబాబు నాయుడుకి కష్టకాలమే అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.