విశాఖలో ఆర్ ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జి పాలిమర్స్‌లో గురువారం తెల్లవారు జామున రసాయన వాయువు లీకేజ్ రసాయనిక వాయువు లీకేజీ ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటికే 8 కి చేరింది. ఇక 200 వందలకు పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇక మృతుల్లో 8 ఏళ్ళ చిన్నారి కూడా ఉంది. ఈ వాయువును పీల్చిన వారు ఎక్కడికక్కడే కుప్పకూలి పోయారు.

ఇక మృతులంతా వెంకటాపురానికి చెందిన వారే. ఇక పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్లు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కాగా గ్యాస్ లీకేజీ కావడంతో గంగరాజు అనే స్థానికుడు ప్రాణభయంతో పరుగులు తీస్తూ కళ్ళు సరిగా కనిపించకపోవడంతో బావిలో పడి మృతి చెందాడు. ఇక కొందరు బైక్ లపై వెళ్తూ కూడా కింద పడిపోయారు.

గ్యాస్ లీకేజ్ ఘటన.. విశాఖకు సీఎం జగన్..!

భారీ వడగళ్ల వర్షం పడుతున్నా.. లెక్కచేయని మందుబాబులు.. వీడియో వైరల్..!