విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేయాలనీ భావిస్తున్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. రాబోయే రోజుల్లో ప్రజల అవసరాలకు తగ్గట్లుగా లైట్ మెట్రో రైలును తీసుకురావాలని భావిస్తుంది. దానికి అనుగుణంగానే లైట్ మెట్రో ప్రాజెక్ట్ కోసం టెండర్లు పిలవబోతుంది. 140 కిలోమీటర్ల మేరకు లైట్ మెట్రో, ట్రామ్ కారిడార్ల ఏర్పాటుకు డిపిఆర్ ల తయారీకి ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు డిపిఆర్ ల తయారీకి కేంద్ర ప్రభుత్వ సంస్థలు రైట్స్, డిఎంఆర్సీ ముందుకు వచ్చాయి.

రెండు దశల్లో లైట్ మెట్రో కారిడార్, 3 కారిడార్లుగా ట్రామ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో పాత పోస్టాఫీస్ నుండి ఆర్కే బీచ్ వరకు, అదే విధంగా అనకాపల్లి నుండి స్టిల్ ప్లాంట్ వరకు ఎన్ఎడి జంక్షన్ నుండి పెందుర్తి వరకు ట్రామ్ కారిడార్లు నిర్మించాలని నిర్ణయించింది.

  •  
  •  
  •  
  •  
  •  
  •