తమిళ హీరో విశాల్ గురించి తమిళ ఇండస్ట్రీతో పాటు,, తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇప్పటి వరకు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి – విశాల్ ప్రేమించుకుంటున్నారని కాని శరత్ కుమార్ పెళ్ళికి అడ్డు చెప్పడంతోనే విశాల్ – వరలక్ష్మి పెళ్లికి అడ్డంకిగా మారిందని అందరూ అనుకుంటున్నారు. విశాల్ ఇప్పటి వరకు బయటకు వరలక్ష్మి తనకు మంచి ఫ్రెండ్ మాత్రమే అని చెబుతూ వచ్చాడు.

ఇప్పుడు విశాల్ అందరూ అనుకుంటున్నట్లు వరలక్ష్మిని కాకుండా హైదరాబాద్ కు చెందిన విజయ్ రెడ్డి – పద్మజల కూతురు అనీషాను పెళ్లి చేసుకోబోతున్నాడు. విజయ్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా బిజినెస్ చేస్తాడని తెలుస్తుంది. ఇప్పటి వరకు అందరూ విశాల్ – అనీషాల పెళ్లి పెద్దలు కుదిర్చిందని అనుకున్నారు. కానీ విశాల్ ట్విస్ట్ ఇస్తూ మా ఇద్దరిది ప్రేమ వివాహమని, తాము కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నామని చెప్పి అందరకి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. త్వరలో తమ కుటుంబసభ్యులు హైదరాబాద్ అనీషా వాళ్ళ ఇంటికి వచ్చి నిచ్చితార్ధం, పెళ్లికి సంబంధించిన కార్యక్రమాల గురించి మాట్లాడతారని, త్వరలో నడిగర సంఘం భవనం పూర్తి కాబోతుందని, అది పూర్తయిన తరువాత అందులోనే తన పెళ్లి చేసుకుంటానని విశాల్ తెలియచేసాడు.