మాస్ హీరో విశాల్ నటిస్తున్న తాజా సినిమా ‘చక్ర’. ఎం ఎస్ ఆనందన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా, రెజీనా ఓ కీలక పాత్రలో నటిస్తుంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ ఈ చిత్ర షూటింగ్‌ ముగియడానికి వారం రోజుల ముందు లాక్‌డౌన్‌ అమలులోకి రావడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఓ యాక్షన్ ద్రిల్లర్ గా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ఇక ‘చక్ర’ని ఓటిటిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇక విశాల్ మల్టీస్టారర్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. తన స్నేహితుడు ఆర్యతో కలిసి సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ‘నోటా’ సినిమాకు దర్శకత్వం వహించిన ఆనంద్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లనుందట. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

ట్రోలర్స్ కు ఘాటుగా సమాధానం చెప్పిన సోను సూద్..!

డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్..?

వాళ్ళను వదిలే ప్రసక్తేలేదంటున్న శివబాలాజీ..!