బీజేపీ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇల్లు అక్రమమని, త్వరగా ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని, అతడు ఉంటున్న కరకట్ట అక్రమమని తెలిసినా చంద్రబాబు నాయుడు ఎందుకు ఖాళీ చేయడం లేదని విష్ణు వర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఇక రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు, లోకేష్ తప్ప ఎవరు మిగలరని అన్నారు.

టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీగా మారిపోయిందని, చంద్రబాబు నాయుడు హయాంలో చేసిన అవినీతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిగ్గు తేల్చాలని, ఇక పార్టీకి చెందిన నేతలతో పాటు చంద్రబాబు నాయుడు అందరూ త్వరలో తీహార్ జైలుకు వెళ్లక తప్పదని అందుకే వీరందరూ త్వరగా హిందీ నేర్చుకుంటే బాగుంటుందని అన్నారు. ఇప్పటికే బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకోవడానికి సిద్ధమవుతుంది. బీజేపీ నేతలు కూడా రాబోయే రోజులలో వైకాపా పార్టీకి అసెంబ్లీలో తామే ప్రతిపక్షంగా వ్యవహరించబోతున్నామని చెప్పుకొస్తున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •