కమలహాసన్ హీరోగా 2013 లో విడుదలైన విశ్వరూపం సినిమా ప్రేక్షకులను అలరించింది. దానికి కొనసాగింపుగా రావలసిన విశ్వరూపం-2 సినిమాను ఒక సంవత్సరం లోపు తీసుకువస్తానని కమలహాసన్ ప్రకటించాడు. తరువాత ఆ చిత్ర నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ అప్పులలో కూరుకుపోవడంతో చేసేదేమి లేక ఆ రెండవ పార్ధుని పక్కన పెట్టారు. మిగిలిన టాకీ పార్టీ తో పాటు, సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ ను ఇప్పుడు కమలహాసన్ తన సొంత డబ్బుతో పూర్తి చేసి ఆగష్టు 10 న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు.

ఈ తరుణంలో విశ్వరూపం-2 తమిళంలో, తెలుగులో బయ్యర్లు ఆసక్తి చూపడం లేదని అనుకున్న స్థాయిలో బిజినెస్ జరగకపోవడంతో ఆగష్టు 10 సినిమా విడుదల అవ్వదని పుంఖాను పుంఖల వార్తలు వచ్చాయి. ఒక సమయంలో ఈ సినిమాకు లాభాల సంగతి తరువాత ముందు సినిమాకు పెట్టిన పెట్టుబడి అసలు వస్తే చాలని కమల్ హాసన్ భావించినట్లు తెలుస్తుంది. కానీ నిన్న కమల్ హాసన్ హైదరాబాద్ వేదికగా విశ్వరూపం – 2 సినిమా ఆడియో వేడుక చేసి సినిమాపై వస్తున్న రూమర్లకు క్లారిటీ ఇచ్చాడు. సినిమా తప్పకుండా ఆగష్టు 10న విడుదలవుతుందని ప్రకటించాడు. మరలా సినిమాను తెలుగులో విడుదల చేయడానికి మంచి డిస్ట్రిబ్యూటర్స్ దొరికారాని, సినిమా ఘనవిజయం సాధిస్తుందని కమలహాసన్ ప్రకటించాడు. విశ్వరూపం-2 సినిమా నైజాం ఏరియాలో సురేష్ ప్రొడక్షన్ విడుదల చేస్తుంటే, గుంటూరు ఏరియాలో యువి ప్రొడక్షన్స్ విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.  

విశ్వరూపం-2 బయ్యర్లు

నైజాం – సురేష్ మూవీస్

సీడెడ్ – ఎన్వీపీ మూవీస్

ఉత్తరాంధ్ర – పూర్వి పిక్చర్స్

ఈస్ట్ – సురేష్ మూవీస్

వెస్ట్ – ఆదిత్య ఫిలిమ్స్

గుంటూరు – యూవీ క్రియేషన్స్

కృష్ణా – శక్తి రమేష్

నెల్లూరు – బాబు ఫిలిమ్స్

 
  •  
  •  
  •  
  •  
  •  
  •