కరోనా వైరస్ దరిచేరకుండా ఇప్పుడు ప్రజలంతా భయాందోళనతో విటమిన్ ట్యాబ్లేట్స్ ను అధికంగా వాడేస్తూ తమ ఆరోగ్యం భద్రంగా ఉందని, తమకు కరోనా సోకినా విటమిన్ ట్యాబ్లేట్ వలన తమకు రోగ నిరోధక శక్తి పెరిగే వెంటనే తమ నుంచి కరోనా వెళ్ళిపోతుందని, కొంతమంది అసలు తమకు కరోనా రాకూడదని దొరికిన విటమిన్ ట్యాబ్లేట్ దొరికినట్లు వేసేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా విటమిన్ డి, సి, మల్టీ విటమిన్ ట్యాబ్లేట్స్ ఇలా అనేక ట్యాబ్లేట్స్ వాడుతూ తమ ఆరోగ్యం సురక్షితంగా ఉందని ఉబలాటపడితిపోతున్నారు.

కానీ విటమిన్ ట్యాబ్లేట్స్ ఎక్కువగా వేసుకుంటే రోగులకు మరికొన్ని కొత్త రోగాలు బయట వేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా విటమిన్ ట్యాబ్లేట్స్ ఎక్కువగా వేసుకునే వారిలో కడుపులో చికాకు, అలసట, గొంతు నొప్పి ఇలా అనేక సమస్యలు వస్తున్నట్లు తెలుస్తుంది. అసలు విటమిన్ ట్యాబ్లేట్స్ అనేది అవసరానికి మించి తీసుకోకూడదు. మన శరీరానికి కావాల్సిన విటమిన్లను ఆహారం ద్వారా ఎక్కువగా తీసుకుంటే మనం ఆరోగ్యవంతంగా ఉంటాం. కానీ తక్కువ ధరలో అతి సులభంగా తమ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటున్నామని కొంతమంది భవిస్తూ అదేపనిగా తీసుకోవడం వలన కచ్చితంగా ప్రమాదంలో పడతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక కొంతమంది కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆకుకూరలు తినకుండా విటమిన్ ఏ ట్యాబ్లేట్స్ విరివిగా వాడడం వలన వారికి ఏకంగా కంటి కాంతి తగ్గిపోతుందని ఒక పరిశోధనలో వెల్లడైందట. అందుకని మనకు కావాల్సిన విటమినులు ఆరోగ్యం ద్వారా పొందటం ఉత్తమమైన పని.

టీవీ చూసినా, క్యారమ్ బోర్డ్ ఆడినా, పాటలు విన్నా బారి జరిమానా తప్పదు