బిగ్ బాస్ 3 తెలుగు 12 వారానికి సంబంధించి నిన్న రాత్రి ఎలిమినేషన్ కార్యక్రమం ముగిసింది. దీనిలో భాగంగా బిగ్ బాస్ పార్కింగ్ టాస్క్ ఇవ్వగా ఈ టాస్క్ ను పూర్తి చేయడంలో నలుగురు విఫలమయ్యారు. వారిలో వరుణ్ సందేశ్,రాహుల్ సిప్లిగంజ్, మహేష్ విట్టా, వితిక… ఈ నలుగురు బిగ్ బాస్ ఈవారం ఎలిమినేషన్ కు సెలెక్ట్ అయినట్లు తెలియచేసాడు. కానీ వితికకు గత వారం బ్యాటిల్ అఫ్ మెడాలియన్ ను గెలుచుకోవడంతో ఇమ్యూనిటీ వచ్చింది. ఇక బిగ్ బాస్ వితికాను మెడాలియన్ వాడి సేవ్ అవుతారా లేక ఎలిమినేషన్ లో ఉంటారా అని అడగగా తాను సేవ్ అవుతానని చెప్పి ఇమ్యూనిటీతో ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంది.

ఇక ఈ వారం ముగ్గురు మాత్రమే ఎలిమినేషన్ లో ఉన్నారు. వరుణ్ సందేశ్, మహేష్, రాహుల్ ఈ ముగ్గురిలో ఒకరు ఈ వారం బయటకు వెళ్లిపోయే ఛాన్స్ ఉంది. ఒకవేళ వితిక కూడా ఉంటే కచ్చితంగా ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయేదని, వరుణ్ – వితిక అభిమానులు రెండుగా చీలడంతో ఆమెకు ఓట్లు తక్కువ పడే అవకాశం ఉంది. కానీ ఆమె తప్పించుకోవడంతో అప్పుడే సోషల్ మీడియాలో వచ్చే వారం ఎలిమినేట్ అయ్యేది మహేష్ విట్టా అని పోస్టులు పెడుతున్నారు.

అసలు గత వారమే మహేష్ విట్టా ఎలిమినేట్ అయినట్లు ముందుగా వార్తలు వచ్చినా చివరకు పునర్నవి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. రాహుల్ కూడా పునర్నవి ఎలిమినేషన్ సందర్భంగా బోరున ఏడ్చాడు. కానీ ఇప్పుడున్న ముగ్గురులో మహేష్ విట్టా కాస్త వీక్ అని అందుకే అతడు ఎలిమినేషన్ అవవడం గ్యారెంటీ అని చెబుతున్నారు. ఇక పార్కింగ్ టాస్క్ నాలుగవ రౌండ్ లో శివజ్యోతి కిందపడి గాయమవ్వగా వెంటనే స్పందించిన బిగ్ బాస్ ఒక వైద్యుడిని హౌస్ లోకి పంపించడం జరిగింది. శివజ్యోతి కాలు బెనికిందని సమాచారం అందుతుంది. దీనిపై ఈరోజు పూర్తి క్లారిటీ రానుంది. శివజ్యోతిని హాస్పిటల్ కు తీసుకొని వెళ్తారా బిగ్ బాస్ హౌస్ లోనే ట్రీట్మెంట్ ఇస్తారో తెలియాల్సి ఉంది.