జంటగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటరైన వరుణ్ సందేశ్ – వితిక జంట దిగ్విజయంగా హౌస్ లో కొనసాగుతున్నారు. ఈ ఇద్దరిలో వితిక ఎవరో ప్రేక్షకులకు సరిగ్గా తెలిసిన దాఖలాలు కూడా లేవు. వితిక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన చాల తక్కువ సినిమాలు చేయడంతో అంతగా తెలియదు. వరుణ్ సందేశ్ భార్యగా బిగ్ బాస్ హౌస్ కు వచ్చిన తరువాతే వితికకు పేరొచ్చింది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటరైన 2 లేదా 3వ వారంలోనే వితిక ఎలిమినేట్ అవ్వవవలసి ఉంది.

బయట ఉన్న ప్రేక్షకులు కూడా రెండవ వారం వితిక ఎలిమినేట్ అవ్వకుండా జాఫర్ ఎలా ఎలిమినేట్ అయ్యాడు ప్రశ్నను కూడా లేవనెత్తారు. ఇక మూడో వారం కూడా నామినేషన్ లో ఉనప్పుడు కచ్చితంగా ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు. కానీ బిగ్ బాస్ సేఫ్ గా ఎలిమినేషన్ నుంచి తప్పించాడు. ఇక వితికకు ఓటింగ్స్ తగ్గడంతో బిగ్ బాస్ అప్పటి నుంచి తెలివిగా ఎలిమినేషన్ లోకి వితిక రాకుండా చేయడంలో సక్సెస్ అవుతున్నాడు.

దీనంతటికి కారణం వరుణ్ – వితిక జంటకు బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ కావడానికి 28 లక్షల రూపాయలు ముట్టచెప్పారట. ఆ రొక్కమే వితికను కాపాడుకుంటూ వస్తుంది. వరుణ్ సందేశ్ ఫైనల్ వరకు ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదట్లో వరుణ్ సందేశ్ పట్ల కూడా కాస్త వ్యతిరేకత ఏర్పడిన ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో అతడి ప్రవర్తన పూర్తిగా మార్చుకోవడంతో అతడికి బయట అభిమానులు బాగా పెరిగిపోయారు.

వితిక… వరుణ్ నీడలో కాలం గడుపుతు వరుణ్ ఆటను కూడా సరిగ్గా ఆడుకోనివ్వకుండా చెడగొడుతుంది. మరొక రెండు మూడు వారాల వరకు వితికకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలుస్తుంది. ఈ వారం కూడా మహేష్, హిమజ, రాహుల్ నామినెటే అయ్యారు. వితికాను బిగ్ బాస్ హౌస్ కావాలనే కాపాడుతుందా? ఎక్కువ డబ్బులు ముట్టచెప్పి తీసుకువచ్చాము కాబట్టి మరిన్ని రోజులు ఉంచి వితిక ఆట తీరుతో ఆకట్టుకోకపోయినా తన భర్త వరుణ్ తో రొమాన్స్ చేస్తూ కాలం వెళ్లదీస్తుంటే బిగ్ బాస్ కూడా సంతృప్తి ఆవిధంగా చెందుతున్నాడా? రియాలిటీ పేరుతో బిగ్ బాస్ ప్రేక్షకులను మైమరిపిస్తూ పక్క స్క్రిప్ట్ రన్ చేస్తున్నాడా? అంత బిగ్ బాస్ స్క్రిప్ట్ రైటర్ కే తెలియాలి.

  •  
  •  
  •  
  •  
  •  
  •