ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచవ్యాప్తంగా క్రీడా ఈవెంట్లు రద్దు అయ్యాయి. ఇక ఈ సీజన్ ఐపీఎల్ కూడా ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్షోభం కొనసాగుతుండగా ఓ వైపు వెస్టిండీస్‌ లో క్రికెట్ జోరు మొదలయింది. విన్సీ ప్రీమియర్‌ లీగ్‌(వీపీఎల్‌)లో భాగంగా టి-10 లీగ్ ను ప్రారంభించడానికి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు షెడ్యూల్ ఖరారు చేసింది. తూర్పు కరీబియన్‌ దీవుల్లో నిర్వహించ తలపెట్టిన ఈ టోర్నీతో వెస్టిండీస్‌ లో మళ్ళీ క్రికెట్ కళ తీసుకురావాలని యోచిస్తోంది. మే 22 నుండి మే 30 వరకు ఈ ఈ లీగ్ జరుగుతుంది. మొత్తం ఆరు జట్లు పాల్గునే ఈ లీగ్ లో మొత్తం 30 మ్యాచ్ లు జరగబోతున్నాయి. ఇందులో అంతర్జాతీయ ఆటగాళ్లు కూడా పాల్గొంటారని.. మొత్తం 72 మంది ఆటగాళ్లు పాల్గొంటారని విండీస్ తెలియచేసింది.

ఇక కరోనా సంక్షోభంలో ఐసీసీ లో సభ్యత్వం కలిగిన ఒక దేశం నిర్వహిస్తున్న తొలి క్రికెట్ టోర్నీ ఇదేకావడం విశేషం. ఇది టీ 10 క్రికెట్ పొట్టి పార్మెట్ అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఇది ఎంతో అలరిస్తుందని.. వీటిని ప్రత్యేక్ష ప్రచారం చేస్తున్నామని వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ కిషోర్‌ షాలో తెలిపారు. ఇక ఆటగాళ్లు భౌతిక దూరం పాటిస్తూనే బరిలోకి దిగబోతున్నారని.. గ్యాలరీల్లో ప్రేక్షకులు ఎవరు ఉండరు కాబట్టి ఆటగాళ్లు భౌతికదూరం పాటించడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు.

గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ‘రెమ్డిసివిర్’.. నెలరోజుల్లో అందుబాటులోకి

ప్రపంచ ఆరోగ్యసంస్థను భెదిరించిన చైనా..!