ఉత్తరాంధ్ర వైసీపీ పార్టీలో లోలోన వేడి రాజుకుని అది రాబోయే రోజులలో కాస్త ఉప్పెనలా మారే అవకాశం కనపడుతుందని వైకాపా పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఉత్తరాంధ్ర బాధ్యతలను చూస్తున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో మంత్రి బొత్స సత్యనారాయణకు అంతగా పొసగడం లేదని బొత్స వైసీపీలో మరొక కీలక నేతగా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డి వర్గంగా ఉంటూ విజయసాయిరెడ్డికి తెలియకుండా గంట శ్రీనివాసరావును వైసీపీ పార్టీలోకి తీసుకురావాలని గట్టి ప్రయత్నాలు చేశారట. ఈ వ్యవహారమంతా విజయసాయిరెడ్డి కరోనా వైరస్ సోకి క్వారంటైన్ లో ఉన్న సమయంలో చకచకా జరిగిందట. కానీ దీనికి విశాఖకు చెందిన మరొక మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రస్తుతానికి గంటా చేరిక పెండింగ్ లో పడింది.

విశాఖకు ఎప్పుడు వెళ్లినా విజయసాయిరెడ్డి మాజీ మంత్రి గంట శ్రీనివాసరావుపై అనేక ఆరోపణలు చేసేవారు. గంటా దోచుకున్న భూముల లెక్క బయటకు తీస్తామని, విశాఖ నగరంలో ఒక్క సెంటు భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా చూస్తామని చెప్పారు. కానీ అలాంటి గంట శ్రీనివాసరావునే పార్టీలోకి తీసుకురావాలని చూడటంతో పాటు ఈమధ్య విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విస్తృతంగా అనేక ప్రచారాలు నడిచాయి. వీటి వెనుక కూడా బొత్స ఉన్నట్లు నమ్ముతున్నారట.

ఈపరిణామాలతో ఇప్పడూ బొత్స సత్యనారాయణ పదవికే ఎర్త్ పెట్టే దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా విజయనగరం జిల్లలో పెను మార్పులు సంభవించే అవకాశాలు కనపడుతున్నాయి. బొత్స సత్యనారాయణ మంత్రి పదవిని తొలగించి మరొక సీనియర్ కోలగట్ల వీరభద్రస్వామికి మంత్రి పదవి ఇస్తారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా బొత్సపై ఆగ్రహానికి మరొక కారణం మనస్సులో ఏదో పెట్టుకొని సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డిపై తప్పుడు ప్రచారం చేసేలా ఉసిగొల్పడమే అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక మరొక వైపున సజ్జల వర్సెస్ విజయసాయిరెడ్డి మధ్య కూడా పార్టీలో సైలెంట్ గా కోల్డ్ వార్ జరుగుతున్నట్లు వినిపిస్తుంది. బొత్స సత్యనారాయణ వ్యవహారమంతా సజ్జల ద్వారా నడిపిస్తూ విజయసాయిరెడ్డికే ఎర్త్ పెట్టాలని చూడటంతో ఇప్పుడు సాయిరెడ్డి పార్టీలో తన పవర్ ఏమిటో చూపించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ బొత్స సత్యనారాయణను కనుక మంత్రి పదవి నుంచి తొలగిస్తే మరోసారి వైసీపీ పార్టీలో విజయసాయిరెడ్డి పవర్ ఏమిటో తెలిసొస్తుందని మరొకరు ఇలాంటి సాహసానికి పూనుకోరని సాయిరెడ్డి వర్గీయులు అంటున్నారట. బొత్స సత్యనారాయణ ఏ పార్టీలో ఉన్నా తన హావ కొనసాగిస్తుంటారు. అలాంటి బొత్సను తప్పించే సాహసం చేస్తారా అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నే అని అనుకోవచ్చు. ఒకవైపున విశాఖలో పరిపాలన రాజధాని కోసం చకచకా పనులు జరుగుతున్న వేళ, వైకాపా పార్టీలో లుకలుకలు ఎక్కడకు దారి తీస్తాయో చూడాలి.

కొరటాల శివ తప్పేమి లేదట, “ఆచార్య” సినిమా కథ విషయంలో అతడే తప్పు పట్టించాడట

బ్యాటరీతో నడిచే మాస్క్, ఇదేదో బలే ఉందే

పోలీసుల కంట పడకుండా రూటు మార్చుతున్న పేకాట రాయుళ్లు