బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన తాజా సినిమా ‘వార్’. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ‘వార్’ సినిమా కలెక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తుంది. బాలీవుడ్ లో ఈ సినిమా మొదటి వారం 200 కోట్ల మైలు రాయిని దాటింది. 200 కోట్ల మైలు రాయిని దాటడం ద్వారా సల్మాన్ ఖాన్ లైఫ్ టైం బిజినెస్ ను అధిగమించింది. అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమా ప్రతి రోజు 20 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది.

వరసగా సెలవలు కలసి వచ్చిన నేపథ్యంలో ‘వార్’ మూవీ హిందీ, తమిళం, తెలుగు వెర్షన్ లను కలుకుపుని దేశ వ్యాప్తంగా 215 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ‘వార్’ కలెక్షన్స్ నికరంగా ఉండడంతో ఇంకా సరికొత్త రికార్డులను సృష్టించబోతోంది అంటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు తరుణ్ ఆదర్శ్.