అక్టోబర్ 2వ తేదీన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాదాకు సంబంధించిన చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో “సైరా నరసింహారెడ్డి” సినిమా విడుదలవ్వగా అదే రోజు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కథానాయకులుగా రూపొందిన “వార్” సినిమా కూడా విడుదలైంది. ఈ రెండు సినిమాలలో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో “సైరా” సినిమాకు మంచి రేటింగ్స్ ఇచ్చి “వార్” సినిమాకు యావేరేజ్ రేటింగ్స్ ఇచ్చారు. కానీ “వార్” సినిమా ముందు “సైరా” సినిమా బాలీవుడ్ లో తేలిపోయింది.

చిరంజీవి స్టామినా టాలీవుడ్ ఇండస్ట్రీలో పని చేసింది తప్ప బాలీవుడ్ లో ఏమాత్రం పనిచేయలేదు. యావేరేజ్ టాక్ వచ్చినా “వార్” సినిమాకు బాలీవుడ్ జనం బ్రహ్మరధం పడుతున్నారు. 10 రోజులు ముగిసే సమయానికి 250 కోట్ల క్లబ్బులో చేరిపోయింది. నిన్న ఒక్కరోజే ఈ సినిమా 9 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. అతి త్వరలో 300 కోట్ల క్లబ్ లో చేరడానికి రెడీగా ఉంది.

మరోవైపున చిరంజీవి నటించిన “సైరా” సినిమా మాత్రం దారుణమైన కలెక్షన్స్ తో బయ్యర్లకు తీవ్ర నష్టాలను మిగల్చనుంది. దాదాపుగా 30 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన ఈ సినిమా ఇప్పటి వరకు 10 కోట్ల రూపాయల మార్క్ కూడా అందుకోలేదని చెబుతున్నారు. మరో వైపున రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం 100 కోట్ల రూపాయల షేర్ దిశగా పరుగులు తీస్తూ చిరంజీవి నటించిన వరుసగా రెండవ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.