వందేళ్ల క్రితం భూమి మీద దాదాపుగా లక్షకు పైగా పెద్ద పులులుండేవి, పెద్ద పులి అడవికి రారాజుగా వెలుగొందుతుండేది. కానీ ఇప్పుడు పెద్ద పులి జాతి కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం భూమి మీద 3900 పులులు మాత్రమే ఉన్నాయట. అంతర్జాతీయంగా పులి చర్మాలకు, గోళ్లకు, ఎముకలకు మంచి డిమాండ్ ఉండటంతో స్మగ్లర్లు, వేటగాళ్లు విజ్రంభిస్తు వాటిని మట్టు పెడుతున్నారు.   

కేవలం గత 19 ఏళ్లలో దాదాపుగా 2300 పులులు వేటగాళ్ల బారిని పడ్డాయి. పులులను రక్షించుకోవడానికి అంతర్జాతీయంగా చాల సంస్థలు ముందుకు వస్తున్నాయి. రాబోయే తరాలలో ఒకప్పుడు పెద్ద పులి ఉండేది అని కథలు కథలుగా చెప్పుకొనే సందర్భం రాకుండా పులులను ఎక్కడికక్కడ సంరక్షిస్తున్నారు. కాగా ఆగ్నేయాసియాలో స్మగ్లర్లు పులులు రోజు రోజుకి తగ్గిపోతుండటంతో ప్రైవేట్ గా పులి సంతతి వృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం గమనార్హం.