ఇలాంటి సంఘటనలు మనం ముస్లిం దేశాలలో వింటుంటాం. కొన్ని ముస్లిం దేశాలలో అయితే మహిళలు ఇంటి నుంచి బయటకు వచ్చి కొన్ని సంవత్సరాలు గడిచిపోయి ఉంటుంది. అసలు ప్రపంచంలో ఏమి జరుగుతుందో కూడా వారికి తెలుసుకునే అవకాశం ముస్లిం పెద్దలు వారికి ఇవ్వరు. అలాంటి సంఘటనలు అక్కడ జరిగితే అది వారి దేశాలలో ఆచార సంప్రదాయాలని కొట్టిపారేయవచ్చు కానీ ఇది ఏకంగా మన భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముర్షిదాబాద్ జిల్లాలో ముస్లిం ప్రాబల్య ప్రాంతాలలో ఇలాంటి పత్వా జారీ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

ముస్లిం మత పెద్దలు పత్వా జారీ చేస్తూ టీవీ చూసినా, క్యారమ్, మద్యం అమ్మినా, తాగినా, కంప్యూటర్ లో పాటలు విన్నా… లాటరీ టిక్కెట్ కొన్నా 500 నుంచి 7 వేల రూపాయల జరిమానాను ఫిక్స్ చేశారు. ఇక ఎవరైనా తప్పు చేసినట్లు గమనించి గ్రామ కమిటీకి కనుక చేరవేస్తే వారికి 200 నుంచి 2 వేల వరకు నజరానా ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పుకొచ్చారు. దీనితో మన దేశంలో కూడా ఇలాంటి ఫత్వాలు జారికావడంతో దేశ పౌరులంతా విస్తు పోతున్నారు. ఇలాంటి వాటిని ప్రభుత్వం కఠినంగా ఎదుర్కొని ప్రజలకు స్వేచ్ఛ కలిగించవల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఏ తప్పుకు ఎంత తప్పో ఒక పట్టిక కూడా విడుదల చేశారు.

– టీవీ చూడడం, మొబైల్ ఫోన్, కంప్యూటర్‌లలో మ్యూజిక్ వింటే వెయ్యి రూపాయలు జరిమానా
– కేరమ్స్ ఆడితే 500
– లాటరీ టికెట్ కొంటే 2 వేలు
– మద్యం అమ్మితే 7 వేల జరిమానాతోపాటు శిరోముండనం చేసి గ్రామంలో ఊరేగింపు
– లాటరీ టికెట్లు విక్రయిస్తే 7 వేలు
– మద్యం తాగితే 2 వేల జరిమానా, చెవులు పట్టుకుని పది గుంజీలు తీయాలి
– గంజాయి కొంటే రూ. 7 వేలు జరిమానా

మద్యం గంజాయి లాంటి చెడు అలవాట్లకు తమ ప్రజలు అలవాటు పడి దారి తక్కుండా జరిమానా వేస్తే బాగానే ఉంటుంది. కానీ టివి చూసినా, క్యారమ్ బోర్డ్, కంప్యూటర్, ఫోన్ లో పాటలు విన్నా ఈ జరిమానాలు గోల ఏమిటో వింతగా, ప్రజల స్వేచ్ఛను హరించేదిలా అయితే కచ్చితంగా ఉంది.