ఇన్ స్టాగ్రామ్ లో “బూమెరాంగ్” వీడియోస్ గురించి తెలిసే ఉంటుంది. ఆ వీడియోస్ ద్వారానే ఇన్ స్టాగ్రామ్ మరింత పాపులారిటీ పెంచుకుంది. ఇక ఆ వీడియో తీసిన తరువాత మనం ఆ వీడియోను సేవ్ చేసుకోవచ్చు లేదా నీకు ఇష్టమైన కాంటాక్ట్స్ కు షేర్ చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు వాట్సాప్ లో కూడా “బూమెరాంగ్” వీడియోస్ ప్రవేశ పెట్టాలన్న ఆలోచనలో ఉంది. దాదాపుగా 7 సెకండ్ల లోపు ఉండే వీడియో లూప్ తో వాట్సాప్ లో ఇంట్రడ్యూస్ చేయనుంది. ముందుగా ఈ ఫీచర్ ను “ఐఓఎస్” లో ఇంట్రడ్యూస్ చేసి, తరువాత ఆండ్రాయిడ్ మొబైల్స్ కు అందుబాటులోకి రానుంది. ఇక “బూమెరాంగ్” వీడియోస్ ఫీచర్ కనుక అందుబాటులోకి వస్తే యువత హల్ చల్ చేయడంలో ఎటువంటి సందేహం లేదు.

  •  
  •  
  •  
  •  
  •  
  •