ఎప్పటికప్పుడు వినియోగదారులకు సరికొత్త ఫీచర్లను అందిస్తూ దూసుకుపోతున్న వాట్సాప్.. తాజాగా మరో అప్డేట్ తో ముందుకు వచ్చింది. మెరుగైన స్టోరేజీ కోసం కొత్త ఫీచర్ తీసుకొచ్చామని.. బీటా యూజర్ల కోసం న్యూ స్టోరేజ్‌ యూఐ ఫీచర్‌ను అందించనున్నట్లు తెలిపింది. స్టోరేజీ మేనేజ్ మెంట్ కోసం స్టోరేజీ సెక్షన్ ను వాట్సాప్ అప్డేట్ చేసింది. కాగా సరికొత్త స్టోరేజీ ఆప్షన్ ద్వారా యూజర్లకు మోడ్రాన్ స్టోరేజీ బార్ కనిపిస్తుంది. అంతేకాకుండా వాట్సాప్ లో మీడియా ఫైల్స్, ఇతర ఫైల్స్ సైజు కూడా చూడవచ్చు. ఇక ఇందులో యూజర్లు అనవసర ఫైల్స్ ను డిలీట్ చేయవచ్చు. మరోవైపు ఫైల్స్ కొత్తవా, పాతవా అని రివ్యూ కూడా చేసుకునే అవకాశం కల్పించారు.