హైదరాబాద్ లో నిన్న ఒకేరోజు అనేక మంది వాట్సాప్ లు క్రాష్ అయ్యాయి. బాధితుల్లో సెలెబ్రిటీలు సైతం ఉన్నట్లు తెలుస్తుంది. సైబర్ బేరగాళ్ళు రూట్ మార్చి.. ఇతరుల ఫోన్ నంబర్లతో తమ ఫోన్లలో వాట్సాప్ ను యాక్టివేట్ చేసుకుని.. వాటి ద్వారా ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా సైబర్ ఎటాక్ లో భాగంగానే హైదరాబాద్ లో వందల వాట్సాప్ లు క్రాష్ అయినట్లు తెలుస్తుంది.

సైబర్ నేరగాళ్లు కొత్తగా వాట్సాప్‌ టేకోవర్‌ స్కామ్స్ మొదలుపెట్టారు. సైబర్ నేరగాళ్లు తమ ఫోన్లో వాట్సాప్‌ ఇన్‌స్టాల్ చేసుకున్నాక ఏదో ఒక సిరీస్ నుండి ఓ ఫోన్ నెంబర్ ను వెరిఫికేషన్ కోసం ఎంటర్ చేస్తున్నారు. దీంతో వెరిఫికేషన్ కోడ్ ఆ నెంబర్ కి వెళ్ళిపోతుంది. ఆ వెంటనే నేరగాళ్లు ఆ నంబర్‌ గల వారికి ఓ కోడ్‌ పొరపాటున మీ ఫోన్‌కు పంపాను. దయచేసి నాకు పంపండి అంటూ ఫోన్ లేదా మెసేజ్ ద్వారా అడుగుతున్నారు. ఆరు డిజిట్స్‌తో ఉండే ఈ వెరిఫికేషన్‌ కోడ్‌ను అందుకున్న వ్యక్తి సైబర్‌ నేరగాడికి చెప్పిన వెంటనే… అతడి వాట్సాప్‌ ఖాతా సైబర్‌ నేరగాడి ఫోన్‌లోకి మారిపోతుంది. ఇక ఆ తరువాత అసలు వ్యక్తి ఫోన్ లోని వాట్సాప్ క్రాష్ అవుతుంది.

ఇక ఇలా వాట్సాప్ ను టేకోవర్ చేసిన వెంటనే సైబర్ నేరగాళ్లు.. సెక్యూరిటీ సిస్టమ్స్ ను మార్చేస్తున్నారు. వెరిఫికేషన్‌ కోడ్‌తోపాటు హింట్‌ క్వశ్చన్‌ను అదనంగా చేరుస్తున్నాడు. దీంతో వాట్సాప్‌ అసలు యజమాని మరోసారి తన ఫోన్‌లో దాన్ని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని ప్రయత్నించి విఫలమవుతున్నాడు. ఈ విధంగా సైబర్ నేరగాళ్లు ఉచ్చులో అమాయకులు బలవుతున్నారు. కావున ఈ తరహా మోసాల బారినపడకుండా ఉండాలంటే ఫోన్లకు వచ్చే వెరిఫికేషన్‌ కోడ్స్‌ను ఎవరికీ పంపకూడదు, చెప్పకూడదు.

మెగాస్టార్ చిరంజీవి మూవీలో రమ్యకృష్ణ..!

ఎట్టకేలకి బోణీకొట్టిన హైదరాబాద్.. కీలక సమయంలో విజయం నమోదు..!

కరోనా వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్..!