సోషల్ మీడియా వేదికగా ఫేక్ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే దీనికి అడ్డుకట్ట వేసేందుకు వాట్సాప్ కొత్త విధానానికి తెరతీసింది. ఫేక్‌ న్యూస్‌కు అడ్డుకట్ట వేసేందుకు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ఆరంభించింది. తప్పుడు సమాచారాన్ని నియంత్రించడానికి ఫొటోలు, మెసేజ్‌ టెక్ట్స్‌ను రివర్స్‌ సెర్చ్‌ చేసే ఫీచర్‌ను అభివృద్ధి చేస్తుంది. రివర్స్‌ సెర్చింగ్‌ ద్వారా తరుచుగా ఫార్వార్డ్ అవుతున్న సందేశం సరైందా కాదా అనేది యూజర్లు తెలుసుకోవడానికి వెబ్సైటు లో చెక్ చేసేలా ఫీచర్ ను రూపొందించింది.

వెబ్‌లో వైరల్‌ అవుతున్న మెసేజ్‌ను సెర్చ్‌ చేయడం ద్వారా నకిలీ వార్తలకు చెక్‌ పెట్టొచ్చు. వాట్సాప్‌ నుంచే నేరుగా మెసేజ్‌ లేదా ఫొటోలను వెబ్‌లో శోధించడానికి యూజర్‌కు అవకాశం ఉంటుంది. వాట్సాప్ కొత్త ఫీచర్ ఎక్కువ సార్లు ఫార్వార్డ్ చేయబడిన సందేశాలను శోధించడానికి సులభమైన మార్గాన్ని అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా బ్రౌజర్ ఫీచర్‌ను కొత్తగా పరిచయం చేసింది. వినియోగదారులకు వచ్చిన సందేశాలకు సంబంధించిన వివరాలను ఈ బ్రౌజర్ అందిస్తుంది. ఏదేని సందేశం గురించి శోధన చేయాలనుకుంటే దాని పక్కనే ఉండే ఈ బ్రౌజర్ ఫీచర్‌పై క్లిక్ చేసినట్లైతే గూగుల్ బ్రౌజర్ ద్వారా దానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.

కొందరి ప్లాస్మాతో చికిత్స అందించడం సాధ్యం కాదంటున్న డాక్టర్లు

ప్రముఖ సింగర్ కు కరోనా పాజిటివ్..!