ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకట్టుకుంటూ సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న వాట్సాప్.. మరో కొత్త ఫిచర్ తో ముందుకు రాబోతుంది. ఇప్పటికే పేమెంట్లు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్న వాట్సాప్.. త్వరలో ఇండియాలోని ప్రజలందరికి లోన్లు ఇవ్వడానికి సిద్దమవుతుంది.

ఇక మాతృసంస్థ పేస్ బుక్ తన ఫైనాన్సియల్ సర్వీసులను మరింత విస్తరించాలని అనుకోవడంతో క్రెడిట్ సర్వీస్ ను ఇండియాలో లాంచ్ చేయబోతుంది. ఇందుకు సంబంధించి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ అఫ్ ఇండియా నుండి అనుమతులను పొందింది. ప్రస్తుతం ఈ ఫీచర్ పేమెంట్లు ఆప్షన్ లో చూడవచ్చు. కాగా ప్రస్తుతం తొలి దశలోనే ఉన్న ఫీచర్ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రాబోతుంది.