పొద్దున్నే నిద్ర లేచేసరికి మన వాట్సాప్ లో కొత్త గ్రూప్ ప్రత్యక్షమవుతుంది. ఎవరు మనల్ని గ్రూప్ లో చేరుస్తారో తెలియదు. ఎందుకు చేరుస్తారో తెలియదు. ఒక పార్టీ పేరుతో.. ఒక హీరో పేరుతో… ఒక ఆధ్యాత్మికత పేరుతో చేర్చి పనికిమాలిన మెసేజ్ లతో ముప్పుతిప్పలు పెడుతుంటారు. గ్రూప్ నుంచి బయటకు వెళ్ళిపోయినా ఫోర్స్ ఫుల్ గా చేర్చే ఘనులు ఉన్నారు. కానీ ఇక నుంచి వాట్సాప్ తీసుకువచ్చిన కొత్త నిబంధనలతో వాటన్నిటికీ ఇక చెక్ పెట్టవచ్చు.

ఇక నుంచి మిమల్ని వాట్సాప్ గ్రూప్ లో చేర్చాలా లేదా అన్నది నిర్ణయించే అధికారం వాట్సాప్ యాప్ ఇక మీకే ఇచ్చింది. ఇప్పటి వరకు గ్రూప్ లో చేరేందుకు ఉన్న నోబడీ ఆప్షన్ స్థానంలో “మై కాంటాక్ట్స్ ఎక్స్ ప్ట్” అనే అంశాన్ని చేర్చింది. దీనిలోకి వెళ్తే అన్ని కాంటాక్టులు లేక మీకు కావాల్సిన కాంటాక్టులు మినహాయించుకునే అవకాశం ఉంది. దానితో మీకు తెలియని వారు మిమల్ని గ్రూప్ లో జాయిన్ చేసే అవకాశం లేదు. ఒకవేళ మీరు ఆ గ్రూప్ లో చేరడం అవసరం అని గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ భావిస్తే వాట్సాప్ చాట్ విండోలో మిమల్ని ప్రత్యేకంగా ఆహ్వానించాల్సిందే. వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త నిబంధనతో మిమల్ని ఎవరు ఫోర్స్ ఫుల్ గా గ్రూప్ లో చేర్చే అవకాశం కోల్పోవడంతో పాటు యూజర్ లకు పెద్ద తలనొప్పి తప్పింది.