ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లతో వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటూ వాట్సాప్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగమైన యాప్ వాట్సాప్. ఇక వాట్సాప్ త్వరలో మల్టీడివైజ్ సపోర్టుతో రాబోతుందట. ఇప్పటికే కొందరికి ఈ మల్టీడివైజ్ సపోర్టు లేకపోవడం చాలా అసంతృప్తిగా ఉందట. చాలా మంది వినియోగదారులు ఈ మల్టీడివైజ్ సపోర్టు తీసుకురావాలని వాట్సాప్ ను కోరిన నేపథ్యంలో త్వరలో ఈ ఫీచర్ ను తీసుకురావాలనుకుంటుంది.

గత ఏడాదే రావలసిన ఈ ఫీచర్ కొన్ని కారణాల వల్ల అందుబాటులోకి రాలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ సదుపాయాన్ని వాట్సాప్ పరీక్షిస్తుంది. ప్రస్తుతం 2.20.143 ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ లో ఈ ఫిచర్ కనిపించిందట. వాట్సాప్ ఎప్పుడు ఒక డివైజ్ లో మాత్రమే వాడగలుగుతాం. మరో డివైజ్ లో వాడలేము. ఒక డివైజ్ లో వాడితే మరో డివైజ్ లో పనిచేయదు. అయితే వాట్సాప్ వెబ్ అయితే వాడవచ్చు. కావున మల్టీడివైస్ సపోర్టు అందుబాటులోకి వస్తే వాట్సాప్ ఒకేసారి స్మార్ట్ ఫోన్, ట్యాబ్ వాడేవారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫిచర్ తో ఒకేసారి రెండు వేర్వేరు ఫోన్ లలో వాట్సాప్ ను ఉపయోగించుకోవచ్చు.