వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్ లతో దూసుకుపోతున్న వాట్సాప్.. మరో అద్భుతమైన అప్డేట్ తో రాబోతుంది. ఎంతో కాలం నుండి వినియోగదారులను ఊరిస్తున్న వాట్సాప్-పే.. మే నెల చివరి నాటికి అందుబాటిలోకి రాబోతుంది. ఐసీఐసీఐ బ్యాంకు, HDFC బ్యాంకు, యాక్సిస్ బ్యాంకుల సాయంతో దీనిని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అయితే ఎస్బిఐ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఇప్పటివరకు వాట్సాప్ పే లేట్ అవడానికి కారణం రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా కారణం అని తెలుస్తుంది. ఇప్పుడు వాట్సాప్.. ఆర్బీఐ నియమ నియమ, నిబంధనలు అన్ని పూర్తి చేయడంతో మే లో సేవలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది.

పేస్ బుక్ కి చెందిన వాట్సాప్ కు భారత్ లో 400 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా 2018 ఫిబ్రవరిలో వాట్సాప్ పే తన సేవలను ప్రారంభించింది. ఇది పూర్తి స్థాయిలో అమలులోకి వస్తే వాట్సాప్ మరింతగా సక్సస్ అవుతుందని భావిస్తున్నారు. అంతేకాదు దీనిని వినియోగించడం కూడా సులభంగా ఉంటుందంటున్నారు. పేమెంట్ కోసం మరో యాప్ లేకుండానే దీని నుండే పేమెంట్ చేసుకోవచ్చు. కాగా దేశమంతా ఒకేసారి వాట్సాప్ పే సేవలను అందుబాటులోకి తెస్తే బ్యాంకులపై భారం పడే అవకాశం ఉండడంతో దశలవారీగా దీనిని అమలు చేయాలనీ వాట్సాప్ భావిస్తుంది. ఇక గూగుల్ పే, పెటీఎం, ఫోన్ పే లకు వాట్సాప్ పే గట్టి పోటీ ఇవ్వబోతుంది.

దేశవ్యాప్తంగా ఉగ్రరూపం దాల్చుతున్న కరోనా వైరస్.. 24 గంటల్లోనే భారీగా పాజిటివ్ కేసులు నమోదు..!

కరోనా వ్యాక్సిన్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు సంచలన వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర ఆందోళన..!

కటింగ్ చేయనన్నందుకు బార్బర్ ను కాల్చి చంపాడు..!

కారు ప్రమాదంలో యువ నటుడు మృతి..!