బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రతి వారం ఎవరు బయటకు వస్తారో గతేడాది జరిగిన బిగ్ బాస్ వ్యవహారం మొత్తం ముందుగానే తెలిసిపోవడంతో ఆ థ్రిల్ ప్రేక్షకులు మిస్ కావడంతో పాటు బిగ్ బాస్ యజమాన్యానానికి కూడా బారి లాస్ అని చెప్పుకోవచ్చు. కానీ ఈ ఏడాది లీకు వీరులను బయటకు పంపించి వేసి బిగ్ బాస్ హౌస్ లో జరిగే విషయాలని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ ఏదో విధంగా చిన్న చితక వ్యవహారాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ముందుగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయేది మెహబూబ్ అనే వ్యాఖ్యలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఆ లిస్ట్ లో మెహబూబ్ పేరు తీసేసి దేవి నాగవల్లి పేరు చెప్పేస్తున్నారు.

దేవి నాగవల్లి బిగ్ బాస్ హౌస్ లో పిచ్చి పిచ్చి కామెడీలకు ఆస్కారం ఇవ్వకుండా తన ఆట తాను ఆడుకుంటూ టాస్క్ లు గట్రా సంయమలో చాల స్ట్రాంగ్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఈ విషయం నిన్న నాగార్జున కూడా ఓప్పుసుకున్నాడు. కానీ ఇప్పుడు ఆమె కనుక బయటకు వెళ్ళిపోతే చాలా మందికి రుచించకపోయినా, బిగ్ బాస్ హౌస్ లో ఉండే చాలా మంది కంటెస్టెంట్లు హ్యాపీగా ఫీల్ అవుతారేమో. ఏదైనా మొహం మీద చెప్పడంతో పాటు తన ఆటను తాను ఆడుతూ పిచ్చి పిచ్చి వాగుడు వాగే వారిని చెప్పుతో కొట్టినట్లు అందరి ముందు బయటపడేయడం ఇలాంటివి దేవి నాగవల్లిని చాల మంది కంటెస్టెంట్లు దూరం జరిగారు.

కానీ దేవి నాగవల్లి గత వారం టాస్క్ సూపర్ గా ఆడిందని, మెహబూబ్ ను బయటకు పంపించేయాలని ఎంతో మంది కోరుకున్నారు. కానీ ఆలోపే జరగవల్సినదంతా జరిగిపోయిందని దేవి నాగవల్లి వెళుతుందని గాసిప్స్ బయటకు వచ్చాయి. ఇలా బిగ్ బాస్ కావాలని కన్ఫ్యూజ్ చేస్తూ ఎవరు బయటకు వెళుతున్నారో తెలియకుండా బిగ్ బాస్ అభిమానులలో ఉత్కంఠతకు గురయ్యేలా చేస్తున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.