నందమూరి బాలకృష్ణ హీరోగా అప్పట్లో “ఆదిత్య 369” సినిమాలో టైమ్ మేషన్ ద్వారా హీరో బాలకృష్ణ సినిమాలో వందల సంవత్సరాల వెనకకు, వందల సంవత్సరాల ముందుకు వెళ్లి వస్తుంటాడు. ఇక ఇలాంటి సంఘటనే ఇప్పుడు ఒక మహిళకు అనుభవమైందట. టైమ్ ట్రావెలర్ ద్వారా తాను భవిష్యత్తుకి వెళ్లి వచ్చానంటూ తాజాగా ఒక మహిళా ఆశ్చర్యకర విహస్యాలు తెలియచేసింది.

తాను 2900 సంవత్సరానికి వెళ్ళి వచ్చానని, చాల పచ్చగా ఆహ్లాదకరంగా ఉందని, ఎలియన్లు మనుషులు కంటే చాల మెరుగ్గా ఉన్నారని, తన కడుపులో ఏలియన్ బిడ్డ పెరుగుతుందని, ఎలియన్లు చెప్పుకోకూడనవి చాల చేసారని చెబుతుంది. ఆ మహిళ చెప్పే మాటలు విని నిజంగా వెళ్లి వచ్చిందా? అలాంటి టైమ్ మేషన్ నిజంగా ఉందా అని చాల మంది గూగుల్ లో వెతకడం మొదలు పెట్టారు. సినిమాలలో తప్ప అలాంటి టైమ్ మేషన్ బయట అయితే లేవు.