మనం కుర్చునేటప్పుడు సరిగ్గా కూర్చోకపోతే ఇబ్బందులు వస్తాయన్న సంగతి అందరికి తెలిసిందే. కూర్చున్నప్పుడు కాసేపు రిలాక్స్ కోసం కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నా ఇబ్బందులు తప్పవట. ఇది ముఖ్యంగా అమ్మాయిలకు వర్తిస్తుందని అమెరికాకు చెందిన బార్బరా అనే డాక్టర్ చెబుతున్నారు. అమ్మాయిలు కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం వలన తొడ ఎముక ఒక వైపునకు లాగినట్టు తిరుగుతుందని దీంతో మోకాలి భాగంలో జాయింట్ అడ్జస్ట్ అవ్వవలసి వస్తుందట.

ఇక అలాగే పిరుదుల భాగంలో తీవ్ర ఒత్తిడి పడుతుందని, దీనివలన ఎముకలు కండరాల నొప్పులు వస్తాయని తన అధ్యయనంలో తేలిందని డాక్టర్ చెబుతున్నారు. సయాటికా, కండరాల నొప్పులు, కీళ్ల సమస్యలకు కారణం ఇదేనని వెల్లడించారు. దీన్ని బట్టి అమ్మాయిలు కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం మంచిది కాదని చెబుతున్నారు.