గత నాలుగైదు సంవత్సరాలుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండ పరిస్థితి ఇప్పుడు ఏమంత బాగున్నట్లు లేదు. అతడు మొదట్లో సంచలన హీరోగా మారి యువ ప్రేక్షకుల హృదయాలను, ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రస్తుతం గత నాలుగు సంవత్సరాలుగా సరైన హిట్ లేక అతడు కిందా మీద పడటంతో పాటు గత శుక్రవారం విడుదలైన “వరల్డ్ ఫేమస్ లవర్” సినిమా అతడి కెరీర్ ను మరింత మసక బార్చింది.

ఈ సినిమాతో తనకు పూర్వ వైభవం వస్తుందని భావిస్తే మొదటి రోజు నుంచే అన్ని ప్రాంతాలలో దారుణమైన ప్లాప్ మూటకట్టుకోవడంతో పాటు యూఎస్ మార్కెట్లో అయితే అతడి కెరీర్ మరింత దిగజారడానికి స్పష్టమైన సంకేతాలను ఇచ్చింది. గతంలో విదుహాలైన “నోటా” సినిమా కన్నా తక్కువ కలెక్షన్స్ వసూలు చేసి “వరల్డ్ ఫేమస్ లవర్” బారి లాస్ లను మూటగట్టుకోనుంది.

ఈ సినిమా యూఎస్ లో మొదటి రోజు అంటే గురువారం ప్రీమియర్లలో $111,041 డాలర్లు, శుక్రవారం $63,114 డాలర్లు శనివారం $44,324 డాలర్లు ఆదివారం $14k డాలర్లు మొత్తం వారం ముగిసే సమయానికి $232k డాలర్లను మాత్రమే వసూలు చేసింది. విజయ్ దేవరకొండ డైజెస్టర్ సినిమా “నోటా” కూడా అమెరికాలో $340k డాలర్లు వసూలు చేయడం విశేషం. కానీ ఈ సినిమా మాత్రం “నోటా” సినిమాను కూడా చూస్తుంటే దాటేలా లేదు. రాబోయే పూరి జగన్నాధ్ సినిమాతో అయినా విజయ్ దేవరకొండ నిలబడతాడో లేదో చూడాలి.

  •  
  •  
  •  
  •  
  •  
  •