చైనాలో ప్రాణాంతక కొవిడ్-19 దాటికి రోజు రోజుకు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నారు. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 1770 మంది మృతి చెందారు. అలాగే ఈ వైరస్ సోకినా వారి సంఖ్య 70000 మందికి చేరుకుంది. ఈ వైరస్ పుట్టిన వుహాన్ నగరం ఉన్న ఉన్న హుబే ప్రావిన్స్‌లోనే సోమవారం 139 మంది మరణించారు. ఇక కొత్తగా 1843 మందికి ఈ వైరస్ సోకింది. కొవిడ్-19 పోరులో భారత్ అన్ని విధాలుగా చైనాకు సహకరిస్తుందని త్వరలోనే ఔషధాలను చైనాకు పంపానుందని భారత రాయభారి విక్రమ్‌ మిస్రీ తెలిపారు. ఇక కరెన్సీ ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో కరెన్సీ నోట్లు, నాణాలను కొన్ని రోజుల పాటు వాడకుండా పక్కనపెట్టి, వారిపై అతినీలలోహిత కిరణాలను ప్రసరింపచేసి, ఆ తరువాత వీటిని మళ్లీ సర్క్యులేషన్‌లోకి పంపిస్తున్నారు.

అయితే వుహాన్ నగరంలో వెలుగు చూసిన ఈ కరోనా వైరస్ ఓ హాస్పటల్ డైరెక్టర్నే బలితీసుకుంది. వుహాన్ నగరంలో ‘వూచాంగ్’ హాస్పటల్ డైరెక్టరైన జిమింగ్ ఈ వ్యాధి సోకి మంగళవారం మరణించాడు. కాగా ఇప్పటి వరకు 1700 మంది వైద్య సిబ్బందికి ఈ వైరస్ సోకగా అందులో ఆరుగురు చనిపోయారు. ఇలా ఓ హాస్పటల్ డైరెక్టరే వ్యాధి సోకి మృతి చెందితే ఇక సామాన్య ప్రజల సంగతేంటని నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •