నవరాత్రులు ఈరోజుతో పరిపూర్ణంగా ముగియనున్నాయి. దసరా పండుగ సీజన్ ను ఆన్లైన్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వేల కోట్ల రూపాయల వ్యవహరం చేసి కోట్లకు కోట్ల రూపాయలు సంపాదించేసారు. ఇక ఈ-కామెర్స్ దిగ్గజాలే ఇన్ని కోట్ల రూపాయలు వెనకేసుకుంటే చైనాకు చెందిన షియోమి సంస్థ ఈ పండుగ సీజన్ లో రికార్డు స్థాయి సేల్స్ తో పండుగ సీజన్ లో అందరిని ఔరా అనిపించింది.

దసరా పండుగ అమ్మకాలలో మొదటి కొన్ని రోజులలోనే దాదాపుగా 5.3 మిలియన్ అమ్మకాలతో షియోమీ కొత్త రికార్డ్స్ నెలకొల్పింది. ఇక షియోమి ప్రొడక్ట్స్ లో స్మార్ట్ ఫోన్ లే 3.8 మిలియన్ అమ్మకాలతో అమెజాన్, ఫ్లిప్ కార్డు లో రికార్డ్స్ తిరగరాసింది. నిమిషానికి 525 ఫోన్ లను విక్రయించినట్లు కంపెనీ తెలియచేస్తుంది. షియోమి సంస్థ ఈ ఏడాది ఒక్క స్మార్ట్ ఫోన్ లలోనే 50 సత్యంకు పైగా వృద్ధి రేటుని సంపాదించింది.

షియోమి దూకుడు చూసి ప్రత్యర్థి కంపెనీలు బేజారవుతున్నాయి. చైనీస్ సంస్థకు చెందిన షియోమి కంపెనీ స్మార్ట్ ఫోన్ లతో పాటు టీవీలు కూడా తన సంస్థ నుంచి తీసుకురావడం ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో సూపర్ ఫామ్ లో ఉండటంతో మరికొన్ని చైనీస్ కంపెనీలు ఇండియాన్ మార్కెట్ పై దృష్టి పెట్టాయి.