ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీలో పీఎం నరేంద్రమోడీని కలసిన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం సుమారు 45 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది. ఏపీకి ఆర్ధిక సహాయం చేయవలసిందిగా జగన్ ప్రధాని మోడీని కోరినట్లుగా తెలిపారు. అయితే వీరిద్దరూ భేటీపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండి పడ్డారు.

సీఎం జగన్ ప్రధానికి సమర్పించిన వినతి పత్రంలో ఏముందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. అసలు ఢిల్లీలో మోడీకి అందించిన వినతి పత్ర కాపీని మీడియాకు ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు యనమల. మోడీకి నివేదించిన వాటిలో మీకు నచ్చిన అంశాలు మాత్రమే ప్రజలకు చెబుతారా?.. ఆ డాక్యూమెంట్ ను తొక్కిపెట్టి కేవలం పత్రిక విడుదలచేయడం ఏంటని విమర్శించారు.

ఒకవైపు తెలంగాణ సీఎం కెసిఆర్ తో సంబంధాలు పెట్టుకొని.. విభజన హామీలు నెరవేర్చాలని ప్రధానిని అడిగినట్లు చెప్పటం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకా? అని ప్రశ్నించారు. హోదా ఇచ్చేది లేదని స్వయానా కేంద్ర మంత్రులే చెబుతున్న.. వైసీపీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు. అసలు ఈ వైసీపీ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags: Bjp, tdp, ycp


  •  
  •  
  •  
  •  
  •  
  •