తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్(64) బుధవారం కరోనా వైరస్ తో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ శ్రేణులు తీవ్ర విషాదంలో ఉన్నారు. ఇక దుర్గాప్రసాద్ మృతి పట్లు ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేసారు. దుర్గాప్రసాద్ అనుభవజ్ఞులైన నాయకులని ఏపీ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించారంటూ నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మోదీ ట్వీట్ చేశారు.

ఇటీవల దుర్గాప్రసాద్ కు కరోనా సోకడంతో చెన్నై అపోలో హాస్పిటల్ లో చేరి అయన చికిత్స తీసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా అక్కడే ఉండి చికిత్స తీసుకుంటున్న ఆయనకు తీవ్ర గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు.

ఏపీలో మరో 8,835 పాజిటివ్ కేసులు..!

తూచ్ నాకు రియా చక్రవర్తికి ఎటువంటి సంబంధం లేదంటున్న ప్రముఖ హీరోయిన్

టార్గెట్ బచ్చన్ కుటుంబం, భద్రత మరింత కట్టుదిట్టం