బీజేపీ పార్టీకి ఇప్పుడు అర్జెంటు గా దక్షిణాదిలో ఒక నమ్మకమైన మిత్రుడు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే తమిళనాడులో అన్నాడీఎంకే ఉన్న రేపో మాపో సైకాల విడుదల తరువాత ఎలాంటి పరిణామాలుంటాయో తెలియని పరిస్థితి. మరొక వైపున గత పాతికేళ్లుగా కలిసి నడుస్తున్న పార్టీలు బీజేపీ పార్టీకి రామ్ రామ్ చెప్పి బయటకు వెళ్లిపోతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ పార్టీకి ఫుల్ మెజారిటీ వచ్చి అధికారాన్ని కైవసం చేసుకోవడమైతే కనపడుతుంది కానీ, వచ్చే 2024 పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరకి తెలియదు. అందుకే నమ్మకమైన మిత్రుల కోసం అర్రులు చాస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు ఏపీలో వైసిపిపై బీజేపీ పార్టీ గట్టిగానే నమ్మకం పెట్టుకుంది.

సీఎం జగన్ తాను అనుకున్నదే చేస్తాడు. 2014 ఎన్నికల సమయంలో వచ్చి తమతో చేరమని, అప్పుడు నువ్వు అధికారాన్ని సులువుగా కైవసం చేసుకుంటావని బీజేపీ నేతలు ఎంత చెప్పినా ససేమీరా అన్నాడు. తాను ఒక్కడిగా వెళ్లి విజయం సాధిస్తానని చెప్పాడు. 2019 ఎన్నికలలో జగన్ కోరుకున్న అధికారం కైవశమవ్వడంతో పాటు బీజేపీ పార్టీ పెద్దలతో ముందు నుంచి ఉన్న మిత్ర సంబంధాలను కొనసాగిస్తూ చిల్లర మాటలు మాట్లాడకుండా హుందగా ప్రవర్తిస్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎలా మాటలు మర్చి ఒకసారి బీజేపీ పార్టీని తిట్టడం మరోసారి పొగడటం అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అన్న రీతిలో వారి వ్యవహారం నడిచింది. ధనైతో ఎప్పుడు రాజకీయాలలో హుందాతనాన్ని చూపించే జగన్ అయితేనేం తమకు శాశ్వత మిత్రుడిగా బాగుంటుందని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారు.

అందులో భాగంగా జగన్ తో అమిత్ షా ఇప్పటికే మంతనాలు పూర్తి చేసి వచ్చే వారంలో సీఎం జగన్ ప్రధాని మోదీతో కూడా భేటీ కానున్నారు. ఈ భేటీ సందర్భంగా కేంద్రంలో చేరి మంత్రిపదవులు తీసుకోవాలని మరోసారి కోరే అవకాశముంది. జగన్ ఎప్పుడైతే సీఎంగా బాధ్యతలు చేపట్టాడో అప్పటి నుంచి అతడిని మంత్రి వర్గంలో చేరమని ఆహ్వానాలు అందుతూనే ఉన్నాయి. కానీ జగన్ మాత్రం తాను బయట నుంచి మీకు పూర్తి మద్దతు ఇస్తానని మాత్రం చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు మరోసారి అమిత్ షాతో భేటీ, ప్రధాని మోదీతో భేటీలు చూస్తుంటే త్వరలో జగన్ పార్టీ కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం కనపడుతుంది.

కానీ సీఎం జగన్ పై వత్తిడి తెచ్చి కేంద్రంలో చేరాలని కనుక బీజేపీ పార్టీ అడిగితే జగన్ కూడా కొన్ని కండిషన్స్ పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే న్యాయవ్యవస్థతో పెద్ద తలనొప్పిగా మారిన జగన్ కు దానిపై పార్లమెంట్ సాక్షిగా పోరాటం చేస్తున్నారు. అలానే గత ఇరవయ్యేళ్ళుగా వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి న్యాయవ్యవస్థలో తన మనుషులను పెట్టుకొని స్టేలు తెచ్చుకుంటున్న చంద్రబాబు కేసుల వ్యవహారం మరోసారి తెరమీద్దకు తీసుకొని రావాలని కోరే అవకాశం ఉంది.

అసలు జగన్ కోరినా కొరకపోయినా బీజేపీ పార్టీ పెద్దలు ఆ దిశగానే ఆలోచిస్తునట్లు కొందరి బీజేపీ నేతలు ఆఫ్ ధీ రికార్డు చెబుతున్నారట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాలు చేస్తూ గత సార్వత్రిక ఎన్నికల ముందు తిరుపతి వచ్చిన అమిత్ షా కారుపై రాళ్లు వేయించడంతో పాటు ప్రధాని మోదీని అత్యంత దారుణంగా కించపరిచేలా మాట్లాడి ఇప్పుడు మరోసారి ప్రధాని మోదీ ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నాడంటే అతడు బయట ఉండటం కంటే లోపల ఉండటమే మేలని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారు. దీనితో జగన్ మంత్రి వర్గంలో చేరడం చంద్రబాబు నాయుడు కేసులు వెలికి తీసి లోపాలకి పంపించడంతో మొత్తం ఒకేసారి లెవల్ అయిపోతుందా? లేక చంద్రబాబు నాయుడు పాదరసంలా ఎవరకి దొరకకుండా కేసుల నుంచి తప్పించుకొని బయటపడతాడో చూడాలి.