ప్రకాశం జిల్లాలో అధికార పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత మద్దన తిరుపతి నాయుడు తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. డీసీఎంఎస్ చైర్మన్ పదవిని మద్దన ఆశించారు. కానీ ఆ పదవి రామనాధంకు ఇవ్వడంతో అలిగిన మద్దన.. తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రాజీనామా లేఖను మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి పంపించారు.

తనకు వైసీపీలో సరైన గౌరవం దక్కలేదని భావిస్తున్న మద్దన.. తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. వైసీపీలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికే పదవులు ఇస్తున్నారని ఈ సందర్భంగా మద్దన ఆగ్రహం వ్యక్తం చేశారు.