జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. తెరాస నాయకుల ద్వారా వైసీపీ పార్టీ వారు తమతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ పార్టీ అదికార ప్రతినిది, మాజీ మంత్రి కె.పార్దసారది స్పందించారు. పవన్ కళ్యాణ్ కు వైసీపీతో కల్సి పని చేయాలన్న కోరిక ఉన్నట్లు ఉందని, పార్ధసారధి అన్నారు. తమ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదన్న ఆయన, రానున్న ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు.

అలాగే చంద్రబాబు నాయుడు మానసికంగా ఓటమికి సిద్దమైనట్లు ఉన్నారని, అందుకనే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపడతానన్న పధకాలను కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల స్టెంట్ లో భాగంగా చంద్రబాబు అనేక శంఖుస్థాపనలు చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రం ఆర్ధికంగా దివాలా తీసే స్థితిలో ఉందని అన్నారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు ఎన్‌ఐఏకు అప్పగిస్తే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు పార్ధసారధి.

pardhasaradhi