ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు చేసిన తప్పులు ఒప్పుకోకపోతే నిరాహారదీక్ష చేపడతానని అన్నారు గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు. జగన్ సీఎం అయితే తిరుమలకు పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నానని.. అందుకే పాదయాత్ర ప్రారంభించానని అన్నారు. అన్నారాంబాబాబు ఈ నెల 4న పాదయాత్ర ప్రారంభించారు. ఆయన పాదయాత్ర ఈ రోజు కడప జిలా బద్వాల్ కు చేరుకుంది. అక్కడ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

బద్వాల్ లో మీడియా తో మాట్లాడిన రాంబాబు.. గత ఐదు సంవత్సరాలలో చంద్రబాబు చేసిన తప్పులని రాబోయే అసెంబ్లీ సమావేశాలలో ఒప్పుకోకపోతే నిరాహార దీక్ష చేస్తానన్నారు. ఈ విషయంలో ఎలాంటి రాజి లేదన్న ఆయన.. ఫిరాయింపుల మీద కూడా చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు. చంద్రబాబు రాజకీయాలను బ్రష్టు పట్టించారని.. ఆయన హయాంలో అభివృద్ధి ఏమి జరగలేదని.. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. ఆయన తన తప్పులను ఒప్పుకుని క్షమాపణ చెప్పాలని.. లేదా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అన్నా రాంబాబు డిమాండ్ చేశారు.

anna rambabu

  •  
  •  
  •  
  •  
  •  
  •